ప్రముఖ వార్తాపత్రికలోని కథనానికి జనసేనాని కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్ : టిడిపి మరియు జనసేన పార్టీలపై శుక్రవారంనాడు ప్రముఖ పత్రికలో ప్రచురితమైన “ముసుగులో సర్దుబాట్లు” అనే వార్తాకథనంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

టిడిపి నాయకులేమో జనసేన, వైసీపీ రెండు పార్టీలు కలిసి బిజేపీతో పొత్తుపెట్టుకున్నారని అంటారు…… వైసీపీ నాయకులేమో టిడిపి, జనసేన పొత్తులు పెట్టుకుని సీట్లను పంచుకుంటున్నాయని అంటున్నారు…… నేను రాజ్ భావన్ లో కేసీఆర్ ను కలిసినప్పుడు వైసీపీ, టిఆర్ఎస్ లతో పొత్తు కుదుర్చున్నానని టిడిపి నాయకులే మళ్ళీ అన్నారు……. మీరు మీ భాజనా రాజకీయాలు, మీ నాటకాలను ఆపేసి ప్రజలకోసం పనిచేయండి లేకపోతే మీరు లేకపోతే తరువాత మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు వేరేలా ఉంటాయి…… ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఎంతో సమయం లేదని……

జనసేన ఎవరితో పొత్తుకు సిద్ధంగా లేదని 175 అసెంబ్లీ మరియు 25 లోక్ సభ స్థానాల్లో తామే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అన్ని పార్టీలకు చురకలంటించారు.