వైసీపీ బి ఫారం అందుకున్న జంగా

అమరావతి: వైసీపీలో కీలకంగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బిసి గర్జన కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో….. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలవ్వడంతో…. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తికి బి ఫారాన్ని గురువారంనాడు సాయంత్రం వైసీపీ కీలకనేత, ఎంపీ విజసాయిరెడ్డి అందజేశారు….. కాగా ఈ నెల 25న ఏపీ అసెంబ్లీలో జంగా నామినేషన్ వేయనున్నారు.