హాస్య బ్రహ్మకు బన్నీ పరామర్శ…..

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, ‘హాస్య బ్రహ్మ’ అయిన బ్రహ్మానందానికి ఈ నెల ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం బ్రహ్మానందం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అభిమానులు అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ….. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజలకు నవ్వులు పంచాలని కోరుకుంటున్న నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందాన్ని కలిసి పరామర్శించారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. బ్రహ్మానందం మరియు అల్లు అర్జున్ కలిసిదిగిన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ అందరిని నవ్విస్తూ…..మనోస్థైర్యం కలిగిన….. భయంలేని….. మా కిల్ బిల్ పాండే నిజమైన ఐరన్ మాన్ అని వర్ణించారు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉంది.” అని ట్వీట్ చేశారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.