ఆ రెండు సినిమాలు మా బ్యానర్ లో గుర్తుండిపోతాయి : దిల్ రాజు

తాము తీయబోయే ఆ రెండు సినిమాలు మా బ్యానర్ లో గుర్తుండిపోయే సినిమాలు అవుతాయని దిల్ రాజు అన్నారు. వివరాల్లోకి వెళితే దిల్ రాజు నూతనంగా మహేష్ బాబుతో తీస్తున్న “మహర్షి” అలాగే త్వరలో ప్రారంభించబోతున్న రీమేక్ చిత్రం “96” ఈ రెండు సినిమాలు తమ బ్యానర్ లో ఓ రేంజ్ లో నిలిచిపోతాయని అన్నారు.

దిల్ రాజు సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూడడం మాములే…… అయితే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యానర్ స్థాయిని పెంచే విధంగా ఈ రెండు సినిమాలు రూపొందిస్తున్నామని తప్పకుండా ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ రేటును సంపాదిస్తాయని అన్నారు. ఈ మాటలతో డిస్ట్రిబ్యూటర్లలో మహర్షి సినిమా ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతుందా కొంత ఆసక్తి నెలకొంది.

అయితే తాజాగా మహర్షి సినిమా విజయవంతం అవుతుందని సన్నిహితుల వద్ద ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఏప్రిల్ లో మహర్షి సినిమా విడుదలకు సిద్ధమయ్యేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే దిల్ రాజు ఆశలను ఈ సినిమా చేరుకోనుందా అనేది విడుదల వరకు వేచిచూడాలి.