ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘లక్ష్మీ”స్ ఎన్టీఆర్..

ప్రేమికుల దినోత్సవం రోజున “లక్ష్మీ”స్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 14న ఉదయం 9.25కు రిలీజ్ కాబోయే ఈ సినిమాలో పేక్షకులకు నిజానిజాలను చూపిస్తాను అనేది సారాంశం.

కాకపోతే వర్మ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ కి ఉన్న నిజమైన సం”బంధం” చూద్దామని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. “లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాలో టాగ్ లైన్ గా చేసిన ఇది కుటుంబ కుట్రల కధ నే అనే టాగ్ లో కుటుంబ అనేది పదంపై ఉన్న ×గుర్తును ఎందుకు ఎందుకు వేశారా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికి ఈ సినిమా ఓ సంచలనం అవుతుందన్న అభిప్రాయం అభిమానులలో వ్యక్తం అవుతుంది.