సరిహద్దులు దాటిన అభిమానం..

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను గుర్తుచేస్తూ తీసిన “యాత్ర” సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. చిత్రంపై ప్రేక్షకులు స్పందిస్తూ సినిమా చూస్తున్నంతసేపు రాజశేఖరరెడ్డిని స్వయంగా చూస్తున్న భావన కలిగిందని యదార్ధాన్ని కళ్ళకు కట్టారని అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోని డల్లాస్ లో కూడా సంబరాలు జరుపుకున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై పదేళ్లు అయినా కూడా ప్రజలలో గుండెల్లో ఆయన ఇప్పటికి సజీవంగా ఉన్నారనే దానికి ఈ సినిమానే నిదర్శనం అని రాజకీయ వర్గాలు అంటుండగా……. మొదటిరోజు భారీగానే కలెక్షన్లు ఈ సినిమా సొంతం చేసుకుందని సినీ వర్గాలు అంటున్నాయి.