యస్పీ, బియస్పీ మధ్య నియోజకవర్గాల పంపిణీ పూర్తి

ఉత్తరప్రదేశ్ లోని 80పార్లమెంట్ నియోజకవర్గాలలో సమాజ్ వాది పార్టీ 37 బహుజన సమాజ్ పార్టీ 38పోటీ చేసే నియోజకవర్గాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయినట్లు సంబంధిత నియోజకవర్గాలలో పార్టీల వారిగా పోటీ చేసే జాబితాను గురువారం నాడు ఇరుపార్టీల జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ మరియు మాయవతి సంతకాలు చేసి పత్రికా ప్రకటన విడుదల చేశారు. మిగత ఐదు నియోజకవర్గాలలో అమేది, రాయబర్లి రెండు స్ధానాలు కాంగ్రెసు పార్టీకి వదిలి వేయగా మిగతా మూడు నియోజకవర్గాలలో రాష్ట్రీయ లోక్ దళ్ కు పొత్తులో భాగం వదిలి పెట్టిన విషయం తెలిసిందే.